HomeTelugu Trendingహీరో విష్ణుకి సోదరిగా కాజల్‌!

హీరో విష్ణుకి సోదరిగా కాజల్‌!

2 13హీరోయిన్‌ కాజల్‌ హీరో మంచు విష్ణుకు సోదరిగా మారారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్‌లో విష్ణుతో కలిసి స్నాక్స్‌ తింటున్న ఫొటోను రక్షాబంధన్‌ సందర్భంగా కాజల్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘హ్యాపీ రాఖీ అర్జున్‌!’ అంటూ మంచు విష్ణును ట్యాగ్‌ చేశారు. దీనికి ఆయన ప్రతి స్పందించారు. ‘హాహాహా.. థాంక్స్‌ అను. చేతుల్లో ఫుడ్‌ లేకుండా మనం కలిసి ఉన్న ఒక్క ఫొటో కూడా లేదనుకుంటా’ అంటూ కాజల్‌ను ట్యాగ్‌ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమాలో విష్ణు అర్జున్‌ పాత్రలో, కాజల్‌ అను పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది.

నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించినట్లు ఇటీవల మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. అందులో ఒకటి వెబ్‌సిరీస్‌ అని, శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారని తెలిపారు. వెబ్‌సిరీస్‌ షూటింగ్‌కు మోహన్‌బాబు క్లాప్‌ కొట్టిన ఫొటోను కూడా షేర్‌ చేశారు. అయితే కాజల్‌తో ప్రాజెక్టు వివరాల్ని విష్ణు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో విష్ణు ఓ హాలీవుడ్‌ సినిమా తీస్తున్నారని, ఇది ఏకకాలంలో తెలుగులోనూ విడుదల కాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఓ హాలీవుడ్‌ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. క్రైమ్‌ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందిస్తున్నారట. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu