HomeTelugu Big StoriesPayal Rajput to Kajal: లాఠీ పట్టిన బ్యూటీలు వీరే!

Payal Rajput to Kajal: లాఠీ పట్టిన బ్యూటీలు వీరే!

Payal Rajput to Kajal:

Payal Rajput to Kajal: టాలీవుడ్‌ హీరోయిన్‌లు గ్లామర్‌ పాత్రల్లోనే కాదు.. చాలెంజింగ్‌ పాత్రలకు కూడ సై అంటున్నారు. అందుకోసం సాహసాలు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. సీనియర్‌ హీరోయిన్‌లు విజయశాంతి, నగ్మ, శోభన వంటి పలువురు ఖాకీ డ్రెస్సు, చేతిలో లాఠీ పట్టుకుని గూండాలను రఫ్‌ ఆడించిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ అందాల ప్రదర్శనే కాకుండా ఇలా మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా ఇరగదీస్తూ తమదైన స్టైల్ లో రెచ్చిపోతున్నారు.

ఇప్పటికే ఫ్యామిలీ సమంత మ్యాన్ వెబ్ సిరీస్ లో, యశోద సినిమాలో పోలీస్‌గా తనదైన యాక్షన్స్ సన్నివేశాలతో ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడు నార్త్ సిటడెల్ తో పాటు తన సొంత ప్రొడక్షన్ హౌస్ లో మా ఇంటి బంగారం సినిమాలో కూడా భారీ యాక్షన్ సీన్‌లతో సమంత రఫ్ ఆడించినుంది.

ఇక ‘డీజే టిల్లు సీక్వెల్’ లో అనుపమ పరమేశ్వరన్ కూడా Raw ఏజెంట్ నటించింది. ఇక కీర్తి సురేష్ ‘సైరన్’ మూవీలో లో యాక్షన్ సన్నివేశాలలో నటించడంతో పాటు త్వరలోనే రివాల్వర్ రీటా అనే కొత్త సినిమాలో కూడా ఆమె ఇదే తరహా పాత్రలో నటించనుంది. డెకాయిట్ అనే సినిమాలో ‘శృతిహాసన్’ కూడా గన్ను పట్టుకుని యాక్షన్స్ సన్నివేశాల్లో నటించింది. గతంలో క్రాక్ సినిమాలో కూడా రవితేజ సరసన అదే తరహా పాత్రలో నటించడం విశేషం. త్వరలో మరికొంత మంది లాఠీ పట్టనున్నారు.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పటికే ‘జిల్లా’, ‘ఘోస్టీ’ వంటి చిత్రాల్లో పోలీసు అధికారిగా కనిపించింది. త్వరలో సూపర్ పోలీస్ ఆఫీసర్​గా ప్రేక్షకులను పలకరించనున్నారు. ‘సత్యభామ’ అనే లేడీ ఓరియెంటడ్ మూవీలో ఆమె ఈ పాత్ర పోషించారు. అఖిల్ డేగల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

మంచు లక్ష్మీ కూడా త్వరలోనే ఖాకీ దుస్తుల్లో కనిపించనున్నారు. ప్రతీక్ ప్రజోష్ డెరెక్షన్​లో వస్తున్న’అగ్ని నక్షత్రం’ చిత్రంలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెరవనున్నరు. రీసెంట్​గా విడుదలైన సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇందులో మోహన్ బాబు కూడా ప్రొఫెసర్ విశ్వామిత్ర అనే ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

కోలీవుడ్ బ్యూటీ త్రిష ఖాకీ దుస్తుల్లో కనిపించనుంది. ‘బృందా’ అనే వెబ్ సిరీస్​లో ఆమె ఈ పాత్ర పోషించనుంది. సూర్ వంగల డైరెక్షన్​లో రూపొందిన ఈ సిరీస్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్​ వేదికగా త్వరలో స్ట్రీమింగ్ కానుంది.

‘కలర్ ఫొటో’, ‘గామీ’ లాంటి సినిమాలతో పాపులర్ అయిన చాందిని చౌదరీ త్వరలోనే పోలీస్ ఆఫీసర్​గా కనిపించనుంది. ప్రకాష్ చిత్ర రూపొందిస్తున్న ‘యేవమ్’ అనే చిత్రంలో ఆమె ఈ పాత్ర పోషించనుంది. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్​లుక్​లో చాందినీ ఖాకీ డ్రెస్సులో సీరియస్​గా కనిపించింది. ఆ పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంది.

‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ లాంటి బోల్డ్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటి పాయల్ రాజ్ పుత్. ఎప్పుడూ సాఫ్ట్​ లేదా గ్లామర్ పాత్రల్లో కనిపించే పాయల్‌.. ఈ సారి కొత్త జోనర్లో కనిపించేందుకు సిద్ధమైంది. ‘రక్షణ’ అనే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్​లో కీలక పాత్ర పోషించనుంది. జూన్ 7న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu