దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా వెలుగొందిన కాజల్ ప్రస్తుతం చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’లో
హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన ‘జనతాగ్యారేజ్’ సినిమాలో ‘నేను పక్కా లోకల్..’
అంటూ ఐటెమ్ సాంగ్ లో నటించింది. ఆ తరువాత వరుసగా అమ్మడుని వెతుక్కుంటూ
ఐటెమ్ సాంగ్స్ ఆఫర్స్ వస్తున్నాయట. తెలుగుతో పాటి తమిళంలో కూడా అవే అవకాశాలు
రావడంతో కాజల్ ఇకపై అటువంటి పాటల్లో నటించనని తెగేసి చెప్పేసిందట. జనతాగ్యారేజ్
లో కూడా ఎన్టీఆర్ తో ఉన్న స్నేహం కారణంగా నటించానని చెబుతోంది. ఈ మధ్య కాజల్ కు
ఏది కలిసి రావడం లేదు. అవకాశాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో
తను వరుసగా ఐటెమ్ సాంగ్స్ చేసుకుంటూ పోతే తనపై ఐటెమ్ గర్ల్ అనే ముద్ర పడిపోతుందని
భయపడిపోతుందట కాజల్. అందుకే ఇక ఐటెమ్ సాంగ్స్ లో నటించనని నిర్ణయం తీసుకున్నట్లు
తెలుస్తోంది. మరి తన మాటపై ఎంతవరకు నిలుస్తుందో చూడాలి!