HomeTelugu Trendingటైమ్‌ వేస్ట్‌ చేయడం లేదు.. ఎంతో సంతృప్తిగా ఉంది: కాజల్‌

టైమ్‌ వేస్ట్‌ చేయడం లేదు.. ఎంతో సంతృప్తిగా ఉంది: కాజల్‌

5 22
కరోనా ఎఫెక్ట్‌తో షూటింగులన్నీ కూడా రద్దు అయ్యాయి. దాంతో తారలంతా కూడా స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు. ఎవరి మనసుకు నచ్చిన పనులను వాళ్లు చేస్తూ, కాలక్షేపం చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా తాను ఇంటి పట్టున ఉన్నప్పటికీ, టైమ్‌ వేస్ట్‌ చేయడం లేదని కాజల్ చెప్పింది.

ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవడం తనకి అలవాటనీ, తాను నేర్చుకునేది జీవితంలో ఎంతవరకూ ఉపయోగపడుతుందనే విషయాన్ని గురించి తాను ఎప్పుడూ ఆలోచించనని అంది. తన మనసుకి నచ్చిన పనులను చేస్తూ వెళతాననీ, అప్పుడే తనకి సంతోషంగా అనిపిస్తూ ఉంటుందని చెప్పింది ఈ బ్యూటీ. అలా ప్రస్తుతం లాక్‌డౌన్‌ టైమ్‌ తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నానని అంది. సమయాన్ని వృథా చేయడం లేదనే సంతృప్తితో రోజులు గడుస్తున్నాయని చెప్పుకొచ్చింది ఈ చందమామ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu