నటుడు రానా సరసన హీరోయిన్‌గా గతంలో కాజల్ చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విజయాన్ని సాధించింది. రానాతో కాజల్ కెమిస్ట్రీ అదిరిందనే వార్తలు కూడా వినిపించాయి. అలాంటి కాజల్ మరోసారి రానా జోడీగా కనిపించనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.
మాఫియా నేపథ్యంలో సాగే ఒక కొరియన్ మూవీ రీమేక్ హక్కులను రానా సొంతం చేసుకున్నాడు. ఆయన హీరోగా ఈ సినిమాను నందినీరెడ్డి రూపొందించనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదటిగా కీర్తి సురేశ్ ను సంప్రదించారు. తెలుగులో ‘మిస్ ఇండియా’.. హిందీలో ‘మైదాన్’ సినిమాలు చేస్తున్న కారణంగా డేట్స్ లేవని ఆమె చెప్పిందట. దాంతో కాజల్ తో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు.