టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని వివాహం అడిన సంగతి తెలిసిందే. కొవిడ్ కారణంగా పెళ్లి వేడుకను సింపుల్ గా చేసుకున్నఈ బ్యూటీ వెంటనే హనీమూన్ కి వెళ్లి వచ్చింది. ఈమధ్యే కొన్ని రోజులు ‘ఆచార్య’ షూటింగులో పాల్గొన్న కాజల్ తన భర్తను వెంట తీసుకొచ్చి, అందరికీ పరిచయం చేసింది. ఇక షూటింగ్ షెడ్యూల్ పూర్తవడంతో తాజాగా ముంబై వెళ్లిపోయింది. ఇదిలావుంచితే, భర్తని కూడా తన సినిమా ఫీల్డులోకి దింపడానికి అమ్మడు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భర్త చేత ప్రొడక్షన్ కంపెనీని నెలకొల్పించే ఆలోచన చేస్తోందని అంటున్నారు. తమ బ్యానర్ ద్వారా ముందుగా చిన్న బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూ.. కొత్త నటీనటులను పరిచయం చేయాలని ఈ దంపతులు ప్రణాళికలు వేస్తున్నారట. ఓటీటీ సంస్థలకు కూడా వెబ్ సీరీస్ వంటి కంటెంట్ సమకూర్చాలని ఆలోచిస్తున్నారని సమాచారం.