కాజల్ ఆశాలన్నీ గురువుపైనే!
తనని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసి పుణ్యం కట్టుకొన్న దర్శకుడు తేజాపై కాజల్ చాలా ఆశలు పెట్టుకొంది. ఆమె నటించిన “సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం, దో లఫ్జోంకి కహానీ” సినిమాలు బాక్సాఫీసు వద్ద దారుణంగా విఫలమవ్వడంతో ఆమెకి టాలీవుడ్ లో మరో అవకాశం లభించలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క తమిళ చిత్రం మాత్రమే ఉంది. ఈ సినిమా కూడా ఫ్లాపాయితే ఇక ఆమె కెరీర్ కష్టాల్లో పడ్డట్లే.
అందుకే.. తెలుగులో తనకు ఆఖరి అవకాశమైన తేజ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొంది. ఈ సినిమాలో కాజల్ ఓ ఇల్లాలిగా నటిస్తోంది. రాణా కథానాయకుడీగా నటించనున్న ఈ చిత్రానికి తేజ దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది!