HomeTelugu Trendingముఖ్యమైన అనౌన్స్‌మెంట్ త్వరలో వస్తుంది: కాజల్‌

ముఖ్యమైన అనౌన్స్‌మెంట్ త్వరలో వస్తుంది: కాజల్‌

Kajal crazy announcement co

టాలీవుడ్ చందమామ కాజ‌ల్ అగ‌ర్వాల్ 2020 అక్టోబర్ 30న త‌న స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ల‌య్యాక కూడా ప‌లు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులు ఇస్తూ తెగ సంద‌డి చేస్తుంది. ప్రస్తుతం కాజల్‌ చిరంజీవితో ఆచార్య, నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న “ఘోస్ట్” సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కాజల్ తల్లి కాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మ‌రి కొద్దిరోజుల‌లో కాజ‌ల్ దంప‌తులు మొదటి పెళ్లిరోజు జ‌రుపుకోనుండ‌గా, ఈ లోపు క్రేజీ అప్‌డేట్ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది కాజ‌ల్‌. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ముఖ్యమైన అనౌన్స్‌మెంట్ త్వరలో వస్తుంది.. వేచి ఉండండి’ అని పేర్కొన్నారు. దాంతో ఈ అనౌన్స్‌మెంట్ దేని గురించోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త‌ను తల్లి కాబోతున్న విష‌యం గురించి చెబుతుందా లేదంటే ఏదైన వ్యాపారానికి సంబంధించిన వివ‌రాలు తెలియ‌జేస్తుందా, అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu