HomeTelugu Trendingతల్లి కాబోతున్న చందమామ!

తల్లి కాబోతున్న చందమామ!

Kajal becoming a mother 1

టాలీవుడ్‌ అందాల చందమామ కాజల్ బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కాజల్ తల్లి కాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కాజల్ స్వయంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా తన నిర్మాతలు ముందే హింట్ ఇచ్చారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆచార్య నిర్మాతలకు ఈ విషయాన్ని చెప్పారని త్వరలోనే పెండింగ్ ఉన్న పాటను చిత్రీకరిస్తారని అందుకు కాజల్ ఓకే చెప్పారని కథనాలొస్తున్నాయి. ఈ షూటింగ్ సాధ్యమైనంత తొందరగానే పూర్తి చేయనున్నారట.

Kajal becoming a mother

2020 అక్టోబర్ 30న కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లును అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది. ఆ తరువాత ఎక్కువ సమయం తీసుకోకుండా భర్తతో పాటే షూటింగులకు కూడా వచ్చేసింది. ఆమె సినిమాల నుండి కొంత విరామం తీసుకోవాలనుకుంటుందని సినిమా వర్గాలు అంటున్నాయి. ఇటీవలే కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా తన అక్క తల్లి కావాలని కోరుకుంది. మరోవైపు రూమర్స్ పై కాజల్ ఇంకా స్పందించలేదు. అయితే తాజా సమాచారం మేరకు కాజల్, గౌతమ్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయంపై కాజల్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu