టాలీవుడ్ చందమూమ కాజల్ అగర్వాల్ ఏప్రిల్ 19న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాజల్ కు, ఆమె భర్త గౌతమ్ కిచ్లుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆ బిడ్డ ఎలా ఉందో, తల్లిదండ్రులిద్దరిలో ఎవరి పోలికలతో కనిపిస్తున్నాడు ? అంటూ ఆ శిశువును చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు కాజల్ ఫ్యాన్స్. ఇక మరో వైపు కాజల్ దంపతులు తమ బిడ్డకు ఏం పేరు పెట్టబోతున్నారు ? అయితే తాజాగా ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. కాజల్ సోదరి బాబు పేరును రివీల్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. నిషా అగర్వాల్ కొత్త తల్లిదండ్రులను అభినందిస్తూ హృదయపూర్వక నోట్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూ బార్న్ బేబీ పేరును వెల్లడించారు.
ఆ పోస్ట్ ప్రకారం కాజల్ బాబు పేరు నీల్ కిచ్లు. ఇక మిగిలింది నీల్ కిచ్లును చూడడమే ! కాజల్, గౌతమ్ 2020 అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు. కాజల్ ప్రెగ్నెన్సీ అనే విషయంపై చాలా వార్తలు రాగా, ఈ ఏడాది జనవరిలో గౌతమ్ కిచ్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఆ తరువాత సినిమాల్లో నుంచి తప్పుకున్న కాజల్ వరుస ఫొటోలతో సోషల్ మీడియాలో అభిమాలతో టచ్ లోనే ఉంది.