HomeTelugu Big Stories'కాజల్‌' ఖాతాలో అరుదైన రికార్డు..

‘కాజల్‌’ ఖాతాలో అరుదైన రికార్డు..

3 17
దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ తన ఖాతాలో మరో అరుదైన రికార్డు దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు తాజాగా కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని సింగపూర్ శాఖలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా కాజల్‌ అగర్వాల్‌కు సంబంధించిన కొలతలు కూడా తీసుకున్నారు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు. కాజల్ ఉత్తరాదికి చెందిన అమ్మాయైన దక్షిణాది సినిమాలతోనే పాపులర్ అయింది. ఈ రకంగా మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరనున్న తొలి సౌతిండియా హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ రికార్డులకు ఎక్కింది.

మన దక్షిణాది విషయానికొస్తే.. తొలిసారిగా ప్రభాస్.. ఈ మ్యూజియంలో మైనపు బొమ్మగా స్థానం సంపాదించాడు. ఆ తర్వాత మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో కొలువైన మేడమ్ టుస్సాడ్స్‌లో రీసెంట్‌గానే పెట్టారు. తాజాగా సౌత్ నుంచి మూడో వ్యక్తిగా కాజల్ అగర్వాల్ ఈ మ్యూజియంలో స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ నటించిన ప్యారిస్ ప్యారిస్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఆమె ముంబాయి సాగా, ‘ఇండియన్ 2’ మోసగాళ్లు వంటి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu