టాలీవుడ్ చందమామ కాజల్ పెళ్లిపై మరోసారి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే 35వ పడిలోకి అడుగుపెట్టేసింది. అందుకే ఇప్పుడు అనూహ్యంగా మూడ్ ఛేంజ్ అయ్యిందట. సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చి పెళ్లాడేసే ఆలోచనలో ఉందిట కాజల్. ఇప్పటికే ఇంట్లో వాళ్లు వెతికిన అబ్బాయినే పెళ్లాడేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసిందట ఈ బ్యూటీ.
ఔరంగాబాద్‌కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్‌ని కాజల్ వివాహం చేసుకోబోతున్నట్లు వార్త ఫిలింనగర్ లో వైరల్ అవుతోంది. వీరిద్దరి కుటుంబ సభ్యులు పెళ్లిపై ఇప్పటికే అన్ని మాట్లాడేసుకున్నారని, త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్టు సమాచారం. మరి తాజాగా పెళ్లిపై వస్తున్న వార్తలపై కాజల్ స్పందన ఏంటో చూడాలి. ప్రస్తుతం కాజల్ చేతిలో తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు ఉన్నాయి.