టాలీవుడ్ చందమామ కాజల్ పెళ్లి తర్వాత తొలి ప్రాజెక్టుకు సంతకం చేసింది. నెల రోజుల క్రితం తన ప్రియుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ తిరిగి షూటింగ్ పనుల్లో పడ్డారు. భర్తతోపాటు చెన్నై చేరుకుని, దర్శకుడు డీకేను కలిశారు. ఆయన దర్శకత్వంలో రాబోతున్న ఓ హారర్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజల్ దంపతులతో కలిసి తీసుకున్న ఫొటోను డీకే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. సినిమా ఖరారైందని, కాజల్-గౌతమ్‌తో సంభాషణ ఎంతో సరదాగా అనిపించిందని పేర్కొన్నారు. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో కాజల్‌కు డీకే కథ నరేట్ చేశారట.
ఈ సినిమాలో నలుగురు హీరోయిన్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. కాజల్ పాత్రకు సంబంధించిన ఫొటోషూట్ కూడా పూర్తయినట్లు సమాచారం. త్వరలో పూర్తి వివరాలతో నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రానుంది. తమిళ నటుడు జీవా, కాజల్ జంటగా నటించిన ‘కవలై వెండం’ (‘ఎంతవరకు.. ఈ ప్రేమ’)కు డీకే దర్శకత్వం వహించారు. 2016లో విడుదలైన ఈ సినిమాకి కోలీవుడ్‌లో మంచి స్పందన వచ్చింది. కాజల్ చేతిలో ప్రస్తుతం ‘మోసగాళ్లు’, ‘ఆచార్య’, ‘ముంబయి సగ’, ‘భారతీయుడు 2’ చిత్రాలున్నాయి. ఇవన్నీ వివిధ దశల్లో ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఆమె త్వరలో ‘ఆచార్య’ సెట్‌లో అడుగుపెట్టబోతున్నారు.