HomeTelugu Trendingకాబోయే భర్తతో కాజల్ .. ఫొటో వైరల్‌

కాబోయే భర్తతో కాజల్ .. ఫొటో వైరల్‌

Kajal aggarwal shares her Fటాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ త్వరలో మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును ఈనెల 30 పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఈ అమ్మడు దసరా సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కాబోయే భర్త గౌతమ్‌తో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో కాజల్‌-గౌతమ్‌లు ఒకేరంగు దుస్తులు ధరించి ఉన్నారు. కాబోయే భర్త గౌతమ్‌ను ఆనుకోని కాజల్‌ చిరు నవ్వులు చిందుస్తుంది. ఈ ఫొటోను చూసి నెటిజన్‌లు ‘చూడముచ్చటైన జంట’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే అతిథులను పెళ్లికి ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. తన సినీ ప్రయాణంలో మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతీ ఒక్కరికీ కాజల్‌ సోషల్‌ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ఇకముందు కూడా తనను ఆదరిస్తారిస్తారని కాజల్‌ ఆకాక్షించారు.

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu