టాలీవుడ్ చందమామ భామ కాజల్ అగర్వాల్ రెండేళ్ల క్రితం తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే.. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన కుమారుడికి నీల్ కిచ్లూ అనే పేరు పెట్టుకుంది. మరోవైపు పెళ్లి తర్వాత కూడా కాజల్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత గర్భవతి అయిన తర్వాత సినిమాలకు దూరమయింది. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు కాజల్ రెడీ అవుతుందట.
గర్భవతిగా ఉన్న సమయంలో కాజల్ కాస్తంత లావుగా తయారైన సంగతి తెలిసిందే. వీలయినంత త్వరగా బరువు తగ్గి సినిమాలు చేయాలని భావిస్తోందట. ఇప్పటికే కాజల్ మేనేజర్, ఏజెంట్స్ ఆమె రీఎంట్రీకి తగిన కథ కోసం చూస్తున్నారట.