Kajal Aggarwal : టాలీవుడ్‌లో 2007లో లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కాజల్ అగర్వాల్. తరువాత దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. దాదాపు 17 ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తుంది. కరోనా సమయంలో సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకొని, బాబుని కని ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది.
ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ తాజాగా ‘సత్యభామ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాజల్ మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. దీంతో వరుస ఇంటర్వ్యూలలో ఇస్తుంది. ఈక్రమంలో పలు ఆసక్తికర విషయాలు తెలుపుతుంది.
అయితే ఈ క్రమంలో తను మూవీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందు ఓ సినిమా చేసినట్లు తెలిపింది. 2004 లో ‘క్యూన్ హో గయా నా’ అనే హిందీ సినిమాలో చిన్న పాత్ర చేసింది. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, వివేక్ ఒబెరాయ్, సునీల్ శెట్టి.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ చెల్లెలి పాత్రలో కాజల్ కనిపించింది. అయితే ఆ పాత్ర కొద్దిసేపు మాత్రమే తెరపై కనిపిస్తుంది.
దీని గురించి కాజల్ మాట్లాడుతూ.. ముంబైలో ఉన్నప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది ఆ పాత్ర. అప్పటికి నాకు సినిమాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన కూడా రాలేదు. వచ్చింది అని చేసేసాను. దానికి నాకు ఏం రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. సరదాగా వెళ్లి సరదాగా చేసేసాను అని తెలిపింది.