HomeTelugu NewsKajal Agarwal: ఎన్టీఆర్‌ కోసమే ఆ రూల్‌ బ్రేక్ చేశానంటున్న చందమామ!

Kajal Agarwal: ఎన్టీఆర్‌ కోసమే ఆ రూల్‌ బ్రేక్ చేశానంటున్న చందమామ!

Kajal AgarwalKajal Agarwal: టాలీవుడ్‌ చందమామ కాజ‌ల్ అగ‌ర్వాల్ పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అందులో ఎక్కువ‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది. ప్రస్తుతం కాజల్‌.. ఇండియ‌న్ 2లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇండియ‌న్ మూవీ మూవీ జూన్‌లో రిలీజ్ కాబోతోంది. దీనితో పాటు తెలుగులో లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న చిత్రం ‘స‌త్య‌భామ’. ఈసినిమా మే 17న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో కాజ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌తో కాజ‌ల్ బిజీగా ఉంది.

అయితే కాజల్ తన సినీ కెరీర్ లో స్పెషల్ సాంగ్స్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో మాత్రం కాజల్ అగర్వాల్ పక్కా లోకల్ అనే స్పెషల్ సాంగ్ చేసింది. అయితే ఆ సాంగ్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ కారణమని కాజల్ తాజాగా ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెల్లడించారు. ఎన్టీఆర్ సినిమా కావడం వల్లే ఆ సాంగ్ చేశానని కాజల్ క్లారిటీ ఇచ్చేశారు.

ఎన్టీఆర్ కాకుండా ఎవరు అడిగినా స్పెషల్ సాంగ్ కు ఒప్పుకునే దానిని కాదని కాజల్ అగర్వాల్ పరోక్షంగా పేర్కొన్నారు. తారక్ కోసం ఐటమ్ సాంగ్స్‌ను చేయకూడదనే రూల్స్ ను సైతం బ్రేక్ చేశానని కాజల్ ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది. జూనియర్ ఎన్టీఆర్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన బృందావనం, బాద్ షా, టెంపర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

Kajal Agarwal

ఇంకా ఆమెకు.. స్ట్రాంగ్, ప‌వ‌ర్‌ఫుల్ ఫిమేల్ క్యారెక్ట‌ర్స్ చేయ‌డం అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని, తెలుగులో స‌త్య‌భామ‌తో కొంత వ‌ర‌కు ఆ కోరిక తీరింద‌ని కాజ‌ల్ అగ‌ర్వాల్ అన్న‌ది. యాక్ష‌న్ త‌ర‌హాలో విల‌న్స్‌ను కొట్టే పాత్ర‌లు చేయాల‌నే చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాన‌ని…స‌త్య‌భామ అంగీక‌రించ‌డానికి అది ఓ కార‌ణ‌మ‌ని కాజ‌ల్ అన్న‌ది. స‌త్య‌భామ కు సీక్వెల్‌గా స‌త్య‌భామ 2 కూడా చేసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది.

గౌత‌మ్ కిచ్లూతో త‌న‌ది పెద్ద‌లు కుదుర్చిన ప్రేమ వివాహ‌మ‌ని కాజ‌ల్ అన్న‌ది. గౌత‌మ్‌తో ప‌దేళ్లుగా ప‌రిచ‌యం ఉంద‌ని, లాక్‌డౌన్ టైమ్‌లోనే పెళ్లి చేసుకోవాల‌ని ఫిక్స‌య్యామ‌ని చెప్పింది. కాలేజీ డేస్‌లో త‌న‌కు వంద‌కుపైనే ల‌వ్ లెట‌ర్స్ వ‌చ్చాయ‌ని, ఆ లెట‌ర్స్ చూసి ఎవ‌రిని కొట్ట‌లేద‌ని, ఎవ‌రిపై కోప‌గించుకోలేద‌ని కాజ‌ల్ అన్న‌ది. కాలేజీ డేస్‌తో త‌న‌ను పొగుడుతూ ఓ యువ‌కుడు రాసిన ల‌వ్ లెట‌ర్‌కు తెగ ఇంప్రెస్ అయ్యాన‌ని కాజ‌ల్ చెప్పింది.

ల‌క్ష్మీక‌ళ్యాణం త‌న కెరీర్‌లో ఫ‌స్ట్ అటెండ్ అయినా ఆడిష‌న్ అని, ఆ ఆడిష‌న్స్‌లో ఏడ‌వ‌మ‌ని తేజ అన్నాడ‌ని, కార‌ణం లేకుండా ఏడ‌వ‌డం క‌ష్టం కావ‌డంతో ఏం చేయాలో అర్థం కాలేద‌ని, నాన్న నాతో కావాల‌నే గ‌ట్టిగా మాట్లాడ‌టంతో క‌న్నీళ్లు పెట్టుకున్నాని కాజ‌ల్ తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu