HomeTelugu Trendingసినిమాలకు గుడ్‌బై చెప్పనున్న కాజల్‌!

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న కాజల్‌!

Kajal aggarwal likely quit
టాలీవుడ్‌లో ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌. స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నప్పుడే 2020లో వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లాడింది. ఇటీవలె మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్‌ ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఎంజాయ్‌ చేస్తోంది. అయితే తాజాగా కాజల్‌కు సంబంధించి ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. కొడుకు కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని కాజల్‌ భావిస్తోందట.

ఈ నేపథ్యంలోనే సినిమాలను దూరం కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలతో కూడా చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక గతంలో కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌ కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu