టాలీవుడ్ చందమామ కాజల్ పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ చూసిన ఈ బ్యూటీ పెళ్లి గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. కాజల్ పెళ్లి చేసుకోబోతోందనే వార్త వైరల్ అవుతోంది. ఔరంగాబాద్ కు చెందిన గౌతమ్ అనే ఒక బిజినెస్‌మేన్ తో కాజల్ నిశ్చితార్థం జరిగిపోయిందట. గుట్టుచప్పుడు కాకుండా ఈ నిశ్చితార్థం జరిగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఎంగేజ్‌మెంట్ కు టాలీవుడ్ నుంచి హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రమే హాజరైనట్టు సమాచారం.
మరోవైపు, తన పెళ్లిలోపు తాను కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి చేయాలని కాజల్ భావిస్తోందట. తన పార్ట్ వరకు తొలుత షూటింగ్ పూర్తి చేయాలని దర్శకులకు ఫోన్ చేసి కోరిందట. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తోంది. ఈ సినిమా దర్శకుడు కొరటాల శివకు కూడా ఫోన్ చేసి తన పాత్ర వరకు షూటింగ్ ను త్వరగా ముగించేయాలని కోరిందట.