టాలీవుడ్ చందమామ కాజల్ భర్త గౌతమ్ కిచ్లూ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాజాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని ప్రేమించి పెళ్లి చేసుకోంది. ఇక ఇటీవలే కాజల్ ప్రెగ్నెంట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాజల్ తన భర్తను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకొంటుందట.. తన వద్దకు వచ్చిన డైరెక్టర్లకు తాను చేసిన సినిమాలలో ఒక చిన్న పాత్రలోనైనా గౌతమ్ కనిపించేలా చూడమని కోరుతుందంట.
ఇప్పటికే వీరిద్దరూ తమ బిజినెస్ కోసం ఒక వీడియో షూట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. గౌతమ్ కి కూడా నటనపై ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాజల్ తన భర్తని ముందుండి ఇండస్ట్రీలో నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. గౌతమ్ కూడా చూడడానికి హీరోలని ఉంటాడని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇదే కనుక నిజమైతే గౌతమ్ ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆ డైరెక్టర్ ఎవరు అనేది ఆసక్తిగా మారనుంది.