HomeTelugu Big Storiesనాతో బెడ్రూమ్‌లో.. దర్శకుడిపై మండిపడ్డ కాజల్‌

నాతో బెడ్రూమ్‌లో.. దర్శకుడిపై మండిపడ్డ కాజల్‌

1a 3

హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ చాలా వరకు నెమ్మదిగా కనిపిస్తుంటుంది. ఎప్పుడూ పెద్దగా కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా తన పని తాను చూసుకుంటుంది. తన సినిమాల విషయం తప్పిస్తే పెద్దగా వేరే విషయాలు కూడా పట్టించుకోదు. అలాంటి కాజల్‌ ఈ మధ్య ఓ దర్శకుడి గురించి చాలా దారుణంగా మాట్లాడింది. ఈమె చేసిన కమెంట్స్ చూస్తుంటేనే ఆయన ఎంతగా కాజల్‌ను ఇబ్బంది పెట్టాడో అర్థమైపోతుంది. తాజాగా ఓ టాక్ షోకు వచ్చిన కాజల్.. అక్కడ తనకు ఎదురైన కొన్ని విచిత్రమైన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. అందులో భాగంగానే ఎవరైనా ఓ దర్శకుడితో మళ్లీ వర్క్ చేయకూడదని కోరుకుంటున్నారా అంటే మరో ఆలోచన లేకుండా ఔనని చెప్పింది.

1 24

అందులోనూ దర్శకుడి పేరు కూడా చెప్పింది ఈ ముద్దుగుమ్మ. అతడి పేరు దీపక్ టిజోరీ.. 2016లో ఈయన కాజల్ హీరోయిన్‌గా ‘దో లఫ్జోంకీ కహానీ’ సినిమా చేసాడు. ఇందులో రణ్‌దీప్ హుడా హీరోగా నటించాడు. ఆ సినిమాలో రణ్‌దీప్‌తో కాజల్ లిప్ లాక్ సన్నివేశాలతో పాటు బెడ్రూమ్ సీన్స్ కూడా చేసింది. వాటిపై అప్పట్లో చాలా ట్రోలింగ్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు కాజల్ వీటి గురించి మాట్లాడటమే కాకుండా విమర్శించింది కూడా.

ఈ సినిమాలో తాను అంధురాలిగా నటించానని.. అలాంటి పాత్రతో దర్శకుడు బెడ్ రూం సీన్స్ చేయించాడని చెప్పింది కాజల్. అలాంటి సీన్స్ చేయడం అంటేనే తనకు ఇష్టం ఉండదని.. కానీ దర్శకుడు చెప్పాడు కాబట్టి చేసానని చెప్పింది. అందుకే అప్పుడే ఆ దర్శకుడితో మళ్లీ పని చేయకూడదని ఫిక్సైపోయినట్లు చెబుతుంది కాజల్. తెలుగులో ఎంతో మంది దర్శకులతో పని చేసినా కూడా ఏ ఒక్కరితో కూడా తాను ఇబ్బంది పడలేదని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu