టాలీవుడ్ చందమా కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లూ నూతన సంవత్సరం సందర్భంగా శుభవార్త చెప్పారు. కాజల్ తల్లికాబోతున్నారంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ జంట గోవాకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఓఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్ చేసిన గౌతమ్.. ‘2022.. నిన్నే చూస్తున్నా’ అంటూ ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని ఎటాచ్ చేశారు. దీనిని చూసిన అభిమానులు కాజల్ – గౌతమ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ని గతేడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా ఆమె నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఆచార్య’, ‘భారతీయుడు-2’ చిత్రాలున్నాయి. అయితే, ప్రెగ్నెంట్ కావడంతో ‘భారతీయుడు-2’ నుంచి ఆమె తప్పుకొన్నారని సమాచారం.