Kajal Aggarwal in Satyabhama: ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ పేరు కూడా ముందే ఉంటుంది. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్లు అందుకుంటూ కరియర్ లో ఒక రేంజ్ లో ముందుకు దూసుకుపోయింది కాజల్. కానీ కెరియర్ పిక్ లో ఉన్నప్పుడే కాజల్ పెళ్లి కూడా చేసుకుంది.
పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాలు కంటిన్యూ చేసిన కాజల్ బాబు పుట్టాక కొంచెం స్పీడ్ తగ్గించింది. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న కాజల్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ అయితే ఇచ్చింది కానీ అప్పట్లో వచ్చిన అన్ని ఆఫర్లు రావడం లేదు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 సినిమాలో నటిస్తోంది.
Kajal Aggarwal Satyabhama Review:
అయితే తాజాగా కాజల్ అగర్వాల్ తన కెరియర్ లోనే మొట్టమొదటిసారిగా సత్యభామ అనే ఒక ఫిమేల్ సెంటర్ సినిమాలో నటించింది. ఇప్పటిదాకా కేవలం కమర్షియల్ హీరోయిన్ గానే ప్రయత్నాలు చేసినా కాజల్ అగర్వాల్ ఇప్పుడు రూట్ మార్చేసింది. కాజల్ అగర్వాల్ ఈ సినిమా పైన ఆశలన్నీ పెట్టుకుంది కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
దీంతో కాజల్ అగర్వాల్ కెరియర్ ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు తయారయింది. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలలో నటిస్తోంది కాబట్టి కమర్షియల్ సినిమా ఆఫర్లు తగ్గిపోతాయి. పోనీ మళ్ళీ ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లోనే నటిద్దామా అంటే ప్రేక్షకులు అలాంటి సినిమాలను కాజల్ నుంచి యాక్సెప్ట్ చేయడం లేదు.
కెరియర్ లో ఎప్పుడు చేయలేదని ఒక్కసారి కాజల్ చేసిన ఈ ప్రయత్నం తీవ్ర స్థాయిలో బ్యాక్ ఫైర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ కన్ఫ్యూజన్ కి ఎండ్ పడాలి అంటే కాజల్ అగర్వాల్ ఒక బ్లాక్ బస్టర్ అందుకోవాల్సి ఉంటుంది. భారతీయుడు 2 సినిమా హిట్ అయినా కూడా క్రెడిట్ మొత్తం కమల్ హాసన్ లేదా శంకర్ కి మాత్రమే వెళుతుంది కానీ కాజల్ కి దక్కదు. భారతీయుడు 2 కాకుండా కన్నప్ప సినిమాలో కూడా కాజల్ నటిస్తోంది.. కానీ ఈ సినిమాలో కూడా ఆమెది పెద్ద చెప్పుకోదగ్గ పాత్ర కాదని అనిపిస్తోంది. మరి కాజల్ బ్లాక్ బస్టర్ అందుకొని మళ్ళీ తన కెరియర్ ను మలుపు తిప్పుకుంటుందో లేదో వేచి చూడాలి.