HomeTelugu Reviewsమోసగాళ్లు రివ్యూ

మోసగాళ్లు రివ్యూ

Mosagallu review
టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు- కాజల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మోసగాళ్లు’. రూ.50 కోట్లకు పైగా కేటాయించి హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ సినిమాకు నిర్మాతగానే కాకుండా రచయితగా కూడా మంచు విష్ణు పనిచేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పన్స్‌ వచ్చింది. ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా.. రివ్యూలో చూద్దాం.

కథ: అను(కాజల్‌), అర్జున్‌(మంచు విష్ణు) కవల పిల్లలు. చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరుగుతారు. తండ్రి (త‌నికెళ్ల భ‌ర‌ణి) నిజాయతీ వల్లే తాము పేదలుగా మిగిలిపోయాము అనే భావనలో ఉంటారు. ఉన్నవాడిని మోసం చేసి రిచ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేయాలనుకుంటారు. దీంతో విజ‌య్ (న‌వ‌దీప్‌)తో క‌లిసి ఒక‌ ఫేక్‌ కాల్ సెంట‌ర్ ను ఏర్పాటు చేసి మోసాలు చేద్దామని ప్లాన్‌ వేస్తారు. ఇంట‌ర్న‌ల్ రెవెన్యూ స‌ర్వీస్ పేరుతో అమెరిక‌న్‌ల‌కు ఫోన్ చేసి ప‌న్ను బ‌కాయిలు చెల్లించాల‌ని బెదిరించి అక్ర‌మంగా డ‌బ్బు సంపాదించ‌డం మొద‌లుపెడ‌తారు. అలా దాదాపు రూ.2,600 కోట్లు కొట్టేస్తారు. భారీ మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఫెడ‌ర‌ల్ ట్రేడ్ క‌మిష‌న్‌, భార‌త ప్ర‌భుత్వం విచారణ కోసం ఎసీపీ కుమార్‌ (సునీల్ శెట్టి) నియమిస్తుంది. ఈ మోసగాళ్లును పట్టుకోవడానికి ఏసీపీ కుమార్‌ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఆయన నుంచి తప్పించుకోవడానికి అను, అర్జున్‌ ఎలాంటి ఎత్తులు వేశారు. చివరకు ఈ మోసగాళ్లు ఎలా చిక్కారు అనేదే కథ.

నటీనటులు: మంచు విష్ణు తన పాత్రలో ఒదిగిపోయాడు. విష్ణు తనలోని కొత్త నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కన్నింగ్‌ ఫెలోగా, సీరియస్‌ లుక్‌లో విష్ణు కనిపిస్తాడు. అను పాత్రలో కాజల్‌ పర్వాలేదనిపించింది. ఎసీపీ కుమార్ భాటియాగా సునీశ్‌ శెట్టి నటన బాగుంది. తన అనుభవాన్ని తెరపై కనిపించింది. నవీన్‌ చంద్రా, నవదీప్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

విశ్లేషణ: ‘అతిపెద్ద ఐటీ స్కామ్‌ ఆధారంగా (మోసగాళ్ళు) ఈ సినిమా తెరకెక్కింది. హైదరాబాద్‌లోని బస్తీలో ఉండే అక్కాతమ్ముళ్లు టెక్నాలజీతో వేల కోట్లను ఎలా దోచుకున్నారు అనేదే కథ. అయితే ఇలాంటి క‌థ‌ను ఎంచుకోవడం సులభమే కానీ, దాన్ని తెరపై ఎలా థ్రిల్లింగ్‌ చూపించారు అనేదే ముఖ్యం. దానిపైనే సినిమా విజయం ఆధారపడుతుంది. ఈ విషయంలో చిత్ర దర్శకుడు కాస్త తడబడినట్టు అనిపిస్తోంది. త‌ర్వాత అర్జున్ ఓ కాల్ సెంటర్‌లో ప‌నిచేయ‌డం.. దాని ద్వారా అక్ర‌మంగా అమెరిక‌న్ల డేటాను సేక‌రించి అమ్మడం.. ఈ క్రమంలో విజయ్ కలిసి ఓ భారీ స్కాంకి స్కెచ్‌ వేయడం.. ఇలా కథని చకచకగా నడిపించేశాడు.

అయితే అను ఎంట్రీ తర్వాత కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా, సాదాసీదాగా అనిపిస్తాయి. అలాగే నవీన్‌ చంద్ర, సునీల్‌ శెట్టి మధ్య వచ్చే కొన్ని సీన్లు స్పీడ్‌గా సాగుతున్న కథకు బ్రేకులు వేసినట్లుగా అనిపిస్తాయి. మోసగాళ్లను పట్టుకునేందుకు ఎసీపీ కుమార్ వేసే ఎత్తులు కూడా రొటీన్‌గానే ఉంటాయి. అయితే ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ మాత్రం అదిరిపోతుంది. క్లైమాక్స్‌లో సునీల్ శెట్టి, మంచు విష్ణుల‌కి మ‌ధ్య వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్ బాగుంటుంది.

టైటిల్: మోసగాళ్లు
న‌టీన‌టులు: మంచు విష్ణు, కాజల్‌, సునీల్‌ శెట్టి, నవదీప్‌, నవీన్‌ చంద్ర, రాజా రవీంద్ర తదితరులు
ద‌ర్శ‌క‌త్వం: జెఫ్రీ గీ చిన్
‍కథ, నిర్మాత : మంచు విష్ణు
సంగీతం: సామ్‌ సి.ఎస్‌
హైలైట్స్: మంచు విష్ణు, సునీల్‌ శెట్టి నటన
డ్రాబ్యాక్స్: కొన్ని సన్నీవేశాలు
చివరిగా: పర్వాలేదనిపించిన మోసగాళ్లు
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu