కాజల్ అగర్వాల్ గత 12 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నది. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. సినిమాలు చేతులు లేవు అనుకుంటున్న సమయంలో సడెన్ గా సినిమాలు తెచ్చుకొని మరలా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఇండియన్ 2, ప్యారిస్ ప్యారిస్, ముంబై సాగా సినిమాలు చేస్తున్నది.
ఒకవైపు సినిమాలు చేస్తూనే ఈ అమ్మడు బిజినెస్ రంగంలో కూడా బిజీగా ఉంటోంది. జ్యువెలరీ బిజినెస్ లో ఇప్పటికే అడుగుపెట్టింది కాజల్. ఇదిలా ఉంటె త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించిన కాజల్, ప్రస్తుతం ప్రేమలో పడింది. ఎవరితో అని మాత్రం అడగకండి.. కాజల్ ప్రేమలో పడింది ఎవరితోనో కాదు.. బట్టలతో..మనీష్ అరోరా ఎక్స్ కూప్స్ వారి సెక్విన్ డ్రెస్ తో ప్రేమలో పడిపోయాను అని కాజల్ చెప్తోంది. ఆ డ్రెస్ శరీరానికి చాలా బాగుంటాయని, ఆ డ్రెస్‌లను ధరించడం చాలా హ్యాపీగా ఉంటుందని అంటోంది కాజల్.