HomeTelugu Newsపెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కాజల్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కాజల్

14 4
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లోనే ఉండే హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌. గాసిప్స్‌కి కేరాఫ్‌గా ఉండటం కాజల్‌కు కూడా బాగా ఇష్టం. ఫ్రీ పబ్లిసిటీ వస్తుంటే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి..? కాజల్ కూడా అంతే. అయితే ఈ మధ్య ఇంకాస్త ఎక్కువయ్యాయి ఈ వార్తలు. దాంతో రోజూ వార్తల్లోనే ఉంటుంది కాజల్ అగర్వాల్. ఈ మధ్య కాజల్ పెళ్లి గురించి ప్రతిరోజూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అందులో నిజమెంతుందో తెలియదు కానీ కాజల్ కూడా క్లారిటీ ఇవ్వకుండా మరింత కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంది.

ఇప్పుడు గాసిప్స్ అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటుందీ చందమామ. అందుకే తన పెళ్లిపై వస్తున్న వార్తల్ని అస్సలు నమ్మొద్దంటూ బాగా గట్టిగానే చెప్పేసింది. విజయవాడలో ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కు వచ్చిన కాజల్.. అక్కడ చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ముఖ్యంగా తనకు పెళ్లి చీరలంటే ఎంతో ఇష్టమని.. కానీ పెళ్లి మాత్రం ఇప్పట్లో లేదని క్లారిటీ ఇచ్చేసింది. కొన్ని రోజులుగా తన ప్రమేయం లేకుండానే ప్రేమ.. పెళ్లి అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయని.. అందులో ఎలాంటి నిజం లేదని తేల్చేసింది కాజల్. అలాంటి రూమర్స్ అస్సలు నమ్మవద్దని చెప్పిందీ భామ. పెళ్లి కుదిరితే కచ్చితంగా చెప్తాను.. అప్పటి వరకు ఓపిక పట్టండి.. లేనిపోని వార్తలు రాయొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది కాజల్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu