టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతోందట ఈ విషయన్ని స్వయంగా తానే ఇటీవలే వెల్లడించింది. ‘నాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు బ్రాంకియల్ ఆస్తమా ఉందని తెలిసింది’ . పాలు, చాక్లెట్ల నుంచి బయటపడాల్సిన చిన్నారికి, ఆ వయసులో ఆహారం విషయంలో ఆంక్షలు విధించడం తనకింకా గుర్తుంది అంది. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘ప్రతి శీతాకాలంలోనూ, దుమ్ము ధూళిలోకి వెళ్లిన ప్రతిసారీ బ్రాంకియల్ ఆస్తమా లక్షణాలు మరింత పెరిగేవి. ఆ పరిస్థితుల నుంచి బయట పడటానికి ఇన్‌హెలర్స్ ఉపయోగించడం ప్రాంభించా. వెంటనే మార్పు కనిపించేది. అందువల్ల, ఎప్పుడూ నావెంట ఓ ఇన్‌హెలర్ తప్పకుండా ఉండేలా చూసుకుంటా. మన దేశంలో చాలామందికి ఇన్‌హెలర్స్ అవసరం. అయితే, సామాజిక కళంకంగా భావించి ఎవరూ వెంట ఉంచుకోరు. పబ్లిక్‌గా అయినా… ప్రైవేట్ గా అయినా… ఇన్ హేలర్ ఉపయోగించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా తెలియజెప్పేల ప్రయత్నిద్దాం. సే ఎస్ టు ఇన్ హేలర్స్’’ అని సోషల్ మీడియాలో పోస్టు చేసింది కాజల్.