HomeTelugu Trendingఆ నిర్ణయం నాభర్తదే: కాజల్‌

ఆ నిర్ణయం నాభర్తదే: కాజల్‌

kajal about goodbye to acti
టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కూడా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో టాప్‌ హీరోల దగ్గర నుండి యంగ్‌ హీరోల వరకు అందరితోనూ కలిసి నటిస్తోంది. తాజాగా ఆచార్యలో నటిస్తుంది. మరోవైపు కమల్‌ హాసన్‌ ఇండియన్‌ 2 సినిమాలోనూ నటిస్తోంది. నాగార్జునతో ఓ సినిమా (ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో..), తమిళంలో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు ‘ఘోస్టీ’, డీకే డైరెక్షన్‌లో ఓ సినిమా, మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌ ‘హే సినామిక’ చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది. తన భర్త గౌతమ్‌ కిచ్లూ యాక్టింగ్‌ వదిలేయమని చెప్తే సినిమాల నుంచి తప్పుకుంటానని వెల్లడించింది. కానీ తన భర్త, కుటుంబం నుంచి కావాల్సినంత మద్దతు ఉందని, దానివల్లే ఇప్పటికీ నటన మీద దృష్టి పెట్టగలుగుతున్నాను అని చెప్పింది. అంటే కాజల్‌ ఇండస్ట్రీలో ఎన్నాళ్లు ఉంటుందనేది ఆమె భర్త గౌతమ్‌ చేతిలో ఉందన్నమాట!

Recent Articles English

Gallery

Recent Articles Telugu