HomeTelugu Trendingనా వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నారు: 'కబీర్‌ సింగ్' డైరెక్టర్‌

నా వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నారు: ‘కబీర్‌ సింగ్’ డైరెక్టర్‌

2 7
డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలపై పలువురు నటీమణులు, మహిళా విలేకర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సందీప్‌ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమంత, చిన్మయి శ్రీపాద, అనసూయ, జ్వాలా గుత్తా తదితరులు సోషల్‌మీడియా వేదికగా మండిపడ్డారు. దీనిపై తాజాగా సందీప్ క్లారిటీ ఇచ్చారు. తాను అన్న మాటలను మీడియా తప్పుగా అర్థంచేసుకుందని అన్నారు.

‘నన్ను మీడియా తప్పుగా అర్థంచేసుకుంది. ఓ యువతీ యువకుడు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు తమలోని అన్ని కోణాలను బయటపెట్టకపోతే ఆ బంధంలో ఎమోషన్‌ ఉండదని అన్నాను. అంటే దానర్థం రోజూ యువకుడు తాగి వచ్చి యువతిపై చేయి చేసుకోవాలని కాదు. నేను ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. మహిళల తరఫున, పురుషుల తరఫున సమానంగా మాట్లాడాను. కానీ దురదృష్టవశాత్తు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థంచేసుకున్నారు’ అని వెల్లడించారు.

సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన ‘కబీర్‌ సింగ్’ సినిమా గురించే ఈ వివాదమంతా. తెలుగులో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్న ‘అర్జున్‌రెడ్డి’కి ఈ చిత్రం రీమేక్‌గా వచ్చింది. హిందీలోనూ మంచి విజయం అందుకుంది. అయితే సినిమాలో హీరోయిన్‌గా నటించిన కియారా అద్వాణీ.. హీరో షాహిద్‌ కపూర్‌ చెంపపై కొట్టే సన్నివేశం ఒకటుంది. దీని గురించి సందీప్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఒక అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్‌ కనిపించదని నా అభిప్రాయం’ అన్నారు. దాంతో ఈ వ్యాఖ్యలు కాస్తా వివాదాస్పదమయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu