సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘జైలర్’. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అవుతోంది. ఒక జైలర్ చుట్టూ .. జైలుతో ముడిపడిన అతని ఎమోషన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుండి ‘నువ్వు కావాలయ్యా’ ఫుల్ సాంగ్‌ని విడుదల చేశారు.
‘రా .. దాచుంచారా పరువాలన్నీ ..’ అంటూ ఈ రొమాంటిక్ సాంగ్ సాగుతోంది. రజనీ, తమన్నాపై షూట్ చేసిన ఈ సాంగ్ కలర్ ఫుల్ గా ఉంది. ఈ పాటకు జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటకి సాయికిరణ్ సాహిత్యాన్ని అందించగా, సింధుజా శ్రీనివాసన్ ఆలపించారు. ఈ పాటలో రజనీ మరింత స్టైల్ గా కనిపిస్తున్నారు. థియేటర్లో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలానే ఈ పాట ఉంది. భారీతారాగణంతో రూపొందిన ఈ సినిమాను, ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నారు.