HomeTelugu Newsకార్తికేయ సీక్వెల్‌లో కలర్స్ స్వాతి రీఎంట్రీ?

కార్తికేయ సీక్వెల్‌లో కలర్స్ స్వాతి రీఎంట్రీ?

14 4

యంగ్ హీరో నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా నటించిన ‘కార్తికేయ’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. నిఖిల్ కెరీర్‌లోనే సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు చందు. కార్తికేయ సినిమాలో కలర్స్ స్వాతి నిఖిల్ కు జోడిగా కనిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కలర్స్ స్వాతి పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఈ నేపథ్యంలో కార్తికేయ2 సినిమాలో కలర్స్ స్వాతి కనిపిస్తుందా లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ విషయంపై హీరో నిఖిల్ క్లారిటీ ఇచ్చారు. కార్తికేయ సినిమాలో కలర్స్ స్వాతి పాత్ర కొనసాగింపు ఉంది అని తెలిపాడు. అదే పాత్ర లో కలర్స్ స్వాతి నటిస్తుందని అని నిఖిల్ స్పష్టం చేశాడు. స్వాతితో పాటు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండబోతుందని కూడా తెలిపాడు. ఇక ఈ సినిమాను దసరాకు విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu