HomeTelugu Trendingసీతారామం: థ‌ర్డ్ సింగిల్ ప్రోమో విడుదల

సీతారామం: థ‌ర్డ్ సింగిల్ ప్రోమో విడుదల

Kaanunna Kalyanam Song Prom
మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో నేరుగా హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘సీతారామం’. హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్షన్‌లో వస్తున్న.. ఈ సినిమా నుండి ఇదివ‌ర‌కే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, హీరో హీరోయిన్ల ఇంట్ర‌డ‌క్ష‌న్ టీజ‌ర్‌లు సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా థ‌ర్డ్ సింగిల్ ప్రోమోను విడుద‌ల చేశారు.

కానున్న క‌ళ్యాణం ఎమన్న‌ది అంటూ సాగే మెలోడియ‌స్ సాంగ్ ప్రోమోను మేక‌ర్స్ తాజాగా విడుద‌ల చేశారు. దివంగ‌త‌ సిరివెన్నెల సీతారామ శాస్త్రీ ఈ పాట‌కు సాహిత్యం అందించాడు. అనురాగ్ కుల‌క‌ర్ణి, సింధూరి ఆల‌పించారు. తాజాగా విడుద‌లైన ఈ ప్రోమో శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ పాట ఫుల్ సాంగ్ జూలై 18న విడుద‌ల కానుంది. ఈ సినిమాలోమృనాళ్ థాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథ‌ను మ‌లుపు తిప్పే పాత్ర‌లో న‌టించ‌నుంది. విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై స్వ‌ప్న ద‌త్ నిర్మిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఆగ‌స్టు 5న విడుద‌ల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu