HomeTelugu Trendingసూపర్‌ స్టార్‌ 'కాలా'కు సీక్వెల్‌ వస్తుందా?

సూపర్‌ స్టార్‌ ‘కాలా’కు సీక్వెల్‌ వస్తుందా?

4 3సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ‘కబాలి’, ‘కాలా’ సినిమాలను తెరకెక్కించి గుర్తింపు తెచ్చుకున్నారు పా.రంజిత్‌. దళిత రాజకీయ నేపథ్యంలోని ఈ సినిమాలకు మంచి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం హిందీలో ‘పిర్సాముండా’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమిళంలో ‘ఇరండాం ఉలగపోరిన్‌ కడైసి గుండు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన నీలం ఫౌండేషన్‌ ద్వారా ఆయన పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో పలుచోట్ల గ్రంథాలయాలను ప్రారంభించారు. తాజాగా వేలూరు జిల్లా ఆంబూర్‌లో గ్రంథాలయం, రాత్రి పాఠశాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ‘కాలా’ చిత్రానికి రెండో భాగాన్ని తెరకెక్కిస్తారా..? అని విలేకరులు ప్రశ్నించగా.. ఆ సినిమాకు రెండో భాగం రూపొందించే అవకాశం లేదు. కానీ అలాంటి చిత్రాలు మరిన్ని తెరకెక్కిస్తా. ప్రస్తుతం జ్యోతిక నటించిన ‘రాక్షసి’ చిత్రం ట్రైలర్‌ చూశా. బాగా నచ్చింది. అంబేద్కర్‌ ఆశయాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించడం అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu