సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం “కమ్మరాజ్యంలో కడపరెడ్లు” సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు కేఏ పాల్.. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌ను అవమానపరిచే విధంగా చూపించారని పిటిషన్‌లో పేర్కొన్నారు పాల్.. ఇక, కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, సెన్సార్ బోర్డు, రామ్‌గోపాల్ వర్మ, ఈ సినిమాలో తన క్యారెక్టర్‌లో నటించిన జబర్దస్త్ కమెడియన్ రాము, తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.. కాసేపట్లో పాల్
పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది.
మరి.. ఈ నెల 29వ తేదీన విడుదలకు సిద్ధమైన “కమ్మరాజ్యంలో కడపరెడ్లు” విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది. కాగా, మొత్తం పొలిటికల్ కథతో ఈ సినిమాను తెరకెక్కించారు వర్మ.. ఏపీలోని ఏ పొలిటికల్ లీడర్‌ను వదలకుండా అందరిపై సెటైర్లు వేసినట్టుగా ట్రైలర్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక, కేఏ పాల్‌పై స్పెషల్ సాంగ్‌నే వర్మ విడుదల చేసిన సంగతి తెలిసిందే.