KA Movie Review:
కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన KA సినిమా ఇవాళ అంటే అక్టోబర్ 31, 2024న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. సుజిత్ మద్దెల, సందీప్ మద్దెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను అలరించిందో చూద్దామా..
కథ:
అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథ, కానీ చిన్ననాటి నుండే కుటుంబం కావాలని కోరుకుంటాడు. ఒకరోజు జాబిల్లి గురునాథం (బలగం జయరాం) వద్ద నుండి డబ్బు దొంగిలించి, కృష్ణగిరికి పారిపోతాడు. అక్కడ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తూ, అదే గ్రామంలో ఉంటుం.a సత్యభామ (నయన్ సరిక)తో ప్రేమలో పడతాడు. అయితే ఊర్లో చాలా మంది అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. ఆ సమస్యను ఛేదించేందుకు అభినయ్ ప్రయత్నిస్తాడు. ఈ సంఘటనల వెనుక ఎవరు ఉన్నారు? అభినయ్ ఆ అమ్మాయిలను రక్షించగలిగాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటమే సినిమా కథాంశం.
పెర్ఫార్మెన్స్:
కిరణ్ అబ్బవరం అభినయ్ పాత్రలో అద్భుతంగా జీవించారు. ఈ పాత్రకు తగిన భావోద్వేగాలను ప్రేక్షకులకు చేరవేసి, అభినయ్ పాత్ర వ్యక్తిత్వాన్ని బలంగా ప్రతిపాదించారు. కథ చివర్లో తన పాత్ర ముగింపు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. హీరోయిన్ నయన్ సారిక తన పాత్రలో బాగా నటించింది..సహాయ పాత్రలో తన్వి రామ్ ఆకట్టుకునే నటనను ప్రదర్శించారు. ఇంకా అచ్యుత్ కుమార్, బలగం జయరాం తదితర నటులు వారి పాత్రలతో ఇంప్రెసివ్‌గా నిలిచారు.
సాంకేతికాంశాలు:
సాంకేతికంగా, దర్శకులు సుజిత్, సందీప్ ఈ సినిమా కథను చాలా బాగా మలిచారు. సినిమా చిత్రీకరణలో సతీష్ రెడ్డి, విశ్వాస్ డానియెల్ ల ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కీలక సన్నివేశాలను అందంగా చూపించారు. సామ్ సి.ఎస్. సంగీతం, చిత్రానికి బలం చేకూర్చింది. నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి అధిక నాణ్యతా విలువలతో ఈ సినిమాను తెరకెక్కించారు. స్క్రీన్‌ప్లే కొంచెం మెరుగుపరుచుకున్నట్లయితే బాగుండేది.
ప్లస్ పాయింట్స్:
*థ్రిల్లింగ్ ఎలిమెంట్లు
*కథ, స్క్రీన్ ప్లే
*క్లైమాక్స్ సినిమాకే హైలైట్
మైనస్ పాయింట్స్:
*కొన్ని అనవసరమైన సన్నివేశాలు
తీర్పు:
క సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేమికులకు చాలా బాగా నచ్చుతుంది. కథాంశం, పాత్రల ఆర్క్స్ బాగా తయారుచేశారు. ఉత్కంఠతో కూడిన క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ కొన్నిచోట్ల కథ నెమ్మదిరా ఉండటం ప్రేక్షకులకు అసంతృప్తి కలిగిస్తుంది. కానీ క్లైమాక్స్ మాత్రం సినిమా చూసిన వాళ్ళందరికి గుర్తుండిపోయే హైలైట్. థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ చిత్రం చాలా బాగా నచ్చుతుంది.
రేటింగ్: 3/5