భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్ ఒక్కటయ్యారు. ఈ రోజు (గురువారం, ఏప్రిల్ 22) మధ్యాహ్నం 1.40 గంటలకు వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మొయినాబాద్ ఈ వేడుకకు వేదికైంది. కరోనా కారణంగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా తమ లగ్న పత్రికను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. ఇక విశాల్ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా వీరిద్దరూ కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారగా ఇప్పుడది పెళ్లివరకు దారితీసింది. వీరి పెళ్లా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.