కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ తనయుడు కిరీటి రెడ్డి ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వారాహి చలన చిత్రం బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి ఈ ఓ మూవీని నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీ షూటింగ్ గత కొన్ని నెలల క్రితం బెంగళూరులో భారీ స్థాయిలో మొదలైన విషయం తెలిసిందే. శుక్రవారం కిరీటి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి ‘జూనియర్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.
ఈ సందర్భంగా కిరీటి డైలాగ్ చెబుతున్న టైటిల్ వీడియో శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సందర్భంగా కిరీటి స్కేటింగ్ చేస్తున్న విన్యాసాలని చూపించి ఆకట్టుకున్నారు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీకి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డైలాగ్ టైటిల్ వీడియోకు దేవి అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జెనీలియా కన్నడ నటుడు రవిచంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు.