HomeTelugu Trendingజర్నలిస్టులకు క్షమాపణలు చెప్పిన కంగనా నిర్మాతలు

జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పిన కంగనా నిర్మాతలు

8 8‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ మూవీ నిర్మాతలు జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నటించిన చిత్రమిది. ఇటీవల ఈ సినిమాలోని ఓ పాటను ముంబయిలో విడుదల చేశారు. ఆ సందర్భంలో ఓ జర్నలిస్టుపై కంగన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ‘మణికర్ణిక’ సినిమాకి తక్కువ రేటింగ్‌ ఇచ్చారని, సినిమాకు వ్యతిరేకంగా రివ్యూ రాశాడని సమావేశంలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో రెండు రోజుల క్రితం వైరల్‌ అయ్యింది. దీంతో కంగన క్షమాపణలు చెప్పాలని ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ జర్నలిస్ట్స్‌ గిల్డ్ ఆఫ్ ఇండియా’ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో కంగనను బహిష్కరిస్తామని, ఆమెకు సంబంధించి ఎటువంటి ప్రచారం చేయమని పేర్కొంది. దీంతో ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటనపై క్షమాపణలు కోరుతున్నామని పేర్కొంది. సినిమా పాట విడుదల కార్యక్రమంలో వివాదం తలెత్తిన కారణంగా క్షమాపణలు చెబుతున్నట్లు స్పష్టం చేసింది. ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని తెలిపింది. తమ సినిమా ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ జులై 26న విడుదల కాబోతోందని, మీడియా ఈ సంఘటనను మర్చిపోయి ఎప్పటిలాగే సహకరించాలని కోరింది.

మరోపక్క కంగన క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆమె సోదరి రంగోలి ట్వీట్‌ చేశారు. ‘కంగన సారీ చెప్పదు. ఆమెను క్షమాపణలు చెప్పమని అడిగే అర్హత మీకు లేదు. మీలాంటి దేశ ద్రోహుల్ని, తప్పుడు వ్యక్తుల్ని కంగన సరైన మార్గంలో పెడుతుంది’ అని పోస్ట్‌ చేశారు. అయితే కంగన, రంగోలి తీరును నెటిజన్లు తప్పుపట్టారు. ఇలా ప్రవర్తించడం సరికాదని మందలించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu