
Jr NTR Shirt in Dubai vacation:
టాలీవుడ్ మాస్ హీరో Jr. NTR అటు యాక్షన్‌లో, ఇటు ఫ్యాషన్‌లోనూ ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్ ఇస్తున్నారు. ఇటీవల Devara: Part One ప్రమోషన్ల కోసం జపాన్ వెళ్లిన తారక్, అక్కడ హార్ట్స్ విన్ చేసి ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌కి వెకేషన్‌కి వెళ్లారు.
అయితే ఈ ట్రిప్ కంటే ఎక్కువగా వార్తల్లోకి వచ్చినది – తారక్ వేసుకున్న షర్ట్! అవును, Jr. NTR ఎట్రో బ్రాండ్‌కి చెందిన ఒక ప్రత్యేకమైన డిజైనర్ షర్ట్ ధరించారు. బ్లూ, క్రీమ్, గ్రే కలర్స్‌లో ఉన్న పేస్లీ ప్రింటెడ్ షర్ట్ చాలా క్లాస్‌గా ఉంది. కానీ దాని ధర విన్న అభిమానులు షాక్ అయ్యారు – దీని విలువ ఏకంగా రూ. 85,000!
ఈ ఫోటో సోషల్ మీడియాలో కాస్తా వైరల్ అయిపోయింది. తారక్ సింపుల్‌గా ఉన్నా స్టైల్‌లోనూ వేరే లెవెల్ అంటున్నారు నెటిజన్లు.
ఇదిలా ఉంటే, NTR కెరీర్ పరంగా మాత్రం బిజీ షెడ్యూల్‌లోకి ఎంటర్ అయ్యారు. ఏప్రిల్ 22 నుంచి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Dragon షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇది పూర్తి కావకముందే హృతిక్ రోషన్‌తో కలిసి War 2 లో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు తారక్.
దాంతో పాటు Devara: Part Two కూడా కోరటాల శివ దర్శకత్వంలో రెడీ అవుతోంది. తమిళ డైరెక్టర్ నెల్సన్‌తో ఒక ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మ్ అయింది. 2027 వరకూ ఖచ్చితంగా తారక్ ఫుల్ బిజీగా ఉంటారు.
ఇన్ని సినిమాలతో పాటు ప్రతి లుక్, స్టైల్‌లోనూ క్లాస్ చూపిస్తున్న తారక్, ఇప్పుడు యూత్‌కి ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోతున్నాడు.













