యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘అరవింద సమేత’. ఎన్నో అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. చిత్రం సక్సెస్ కావడంతో యూనిట్ సభ్యులందరూ ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీ విజయం సాధించడంపై ఎన్టీఆర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘ఈ సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడానికి త్రివిక్రమ్ కారణం. ఆయనే లేకుండా ఇదంతా జరిగేది కాదు. ఆయన డెడికేషన్, ఫోకస్ మమ్మల్ని ముందుకు నడిపించింది. థ్యాంక్యూ సర్. ఈ చిత్రాన్ని భుజాలపై మోసిన యూనిట్ సభ్యులందరికి ధన్యవాదాలు. నాకు అతిపెద్ద బలమైన అభిమానులందరికి , మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు’ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.