యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కారుకు సంబంధించిన ట్రాఫిక్ చలానాను ఓ అభిమాని చెల్లించాడు. దానికి ప్రతిఫలంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన టిక్కెట్లు ఇప్పించాలంటూ తన అభిమాన హీరోకి విజ్ఞప్తి చేస్తున్నాడు. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా కారు నడిపినందుకు జూనియర్ ఎన్టీఆర్ కారుకి ట్రాఫిక్ పోలీసులు రూ. 1035 జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమాని ఆ చలానా మొత్తం చెల్లించేశాడు.
దీనికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది. తనతో పాటు తన స్నేహితులకు కూకట్‌పల్లిలోని ఓ థియేటర్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు టిక్కెట్లు ఇప్పించాలని రాశాడు. దీనిపై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌తో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలోగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.