HomeTelugu Trendingకరోనా నుండి కోలుకున్న ఎన్టీఆర్‌

కరోనా నుండి కోలుకున్న ఎన్టీఆర్‌

Ntr tested covid negative
టాలీవుడ్‌ హీరో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వ‌హించిన కొవిడ్ ప‌రీక్ష‌లో ఆయ‌న‌కు నెగెటివ్‌గా నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానుల‌తో పంచుకున్నారు తార‌క్‌. ‘కొవిడ్-19 ప‌రీక్ష‌లో నెగెటివ్ వ‌చ్చింద‌ని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాను. నేను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశించిన‌ ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. కొవిడ్ చాలా ప్ర‌మాద‌క‌రమైంది. కానీ, ఇదొక వ్యాధే కాబ‌ట్టి త‌గిన జాగ్ర‌త్త‌లు, పాజిటివ్ ఆలోచ‌న‌ల‌తో జ‌యించ‌వ‌చ్చు. ఈ పోరాటంలో గెలిచేందుకు ధైర్య‌మే అతి పెద్ద ఆయుధం. ఆందోళ‌న ప‌డ‌కండి. మాస్క్ ధ‌రించండి.. ఇంట్లోనే ఉండండి’ అని కోరారు. మే 10న క‌రోనా బారిన ప‌డ్డారు తార‌క్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu