ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. ‘ఇద్దరూ గొప్ప నాయకులని.. వాళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ పెట్టడం వల్ల ఆయనకు కొత్తగా వచ్చేది లేదు..ఈయనకు పోయేది లేదు అంటూ చెప్పుకొచ్చాడు. కేవలం ఒక పేరు మార్పు వల్ల తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ కున్న కీర్తి ప్రతిష్టలు తగ్గిపోవు.. ఆయన కీర్తిని చెరిపేయలేరు’ అంటూ ట్విట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్.
పెద్దాయన మనవడిగా ఆయన లెగసీని కాపాడడానికి ఎన్టీఆర్ ఈ ట్వీట్ చేశాడు.. కానీ ఇది మాత్రం పొలిటికల్ గా హీట్ పుట్టిస్తుంది. ఇప్పుడు కాకపోయినా.. ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి రావడం ఖాయం అని ఇప్పటికే పార్టీలో ఉన్న కొందరు సీనియర్లు చెబుతున్న మాట. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూనియర్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
— Jr NTR (@tarak9999) September 22, 2022