HomeTelugu Newsఉత్తరాంధ్రకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ సహాయం

ఉత్తరాంధ్రకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ సహాయం

ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తిత్లీ తుపానుతో అల్లకల్లోలమైన సంగతి తెలిసిందే. బాధితులను ఆదునేందుకు సినీ పరిశ్రమ నుంచి జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ముందుకొచ్చారు. తనవంతు సాయంగా ఇద్దరూ కలిసి 20 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ‘తిత్లీ’ తుపానుతో అల్లకల్లోకమైపోయిన ఉత్తరాంధ్రకు జూనియర్ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ సాయం చేసి మరోసారి తమ పెద్ద మనసును చాటుకున్నారు. ఈ విషయాన్ని చిత్రసీమ వర్గాలు ట్విటర్‌ ద్వారా వెల్లడించాయి. గతంలో కేరళను వరదలు, వర్షాలు ముంచేసినప్పుడు కూడా తారక్‌, కల్యాణ్ రామ్‌ వారికి సాయం చేసి అండగా నిలిచారు. అప్పట్లో తారక్‌ రూ.25 లక్షలు ఇవ్వగా కల్యాణ్‌రామ్‌ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు.

2 13

‘తిత్లీ’ బాధితులకు యువకథానాయకుడు విజయ్‌ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి కూడా సాయం చేశారు. విజయ్‌ రూ.5లక్షలు విరాళంగా ఇచ్చారు. అనిల్‌ లక్ష రూపాయలు సీఎం నిధికి అందించారు. కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ‘తిత్లీ’ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ రెండు జిల్లాల్లోని దాదాపు పన్నెండు మండలాల్లో తీవ్ర నష్టం కలిగించింది. తుపాను ధాటికి ఇప్పటివరకు 8 మంది మృతిచెందారు. 2014లో వచ్చిన హుద్‌హుద్‌ కంటే తిత్లీ తుపాను తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణనష్టం తగ్గింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu