Jr NTR: పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది. దీంతో పాటుగా.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
2003 లో గీత లక్ష్మి అనే వ్యక్తి నుండి ఎన్టీఆర్ ఓ ఫ్లాట్ కొనుక్కున్నారు. అయితే గీత లక్ష్మి 1996 నుండి ఇదే ప్రాపర్టీ మార్ట్ గెజ్ ద్వారా లోన్స్ పొందింది. ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి గీత లక్ష్మి మూడు, నాలుగు బ్యాంకుల నుండి లోన్స్ పొందింది. అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు ఆ ఫ్లాట్ అమ్మే సమయంలో ఆ విషయాన్నీ దాచి పెట్టింది. కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గెజ్ ద్వారా లోన్ తీసుకున్నట్లు ఆమె ఎన్టీఆర్‌కు తెలిపింది.
దీనితో ఫ్లాట్ ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో 2019 లోనే బ్యాంకు మేనేజర్లపై ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆయనకు వ్యతిరేకంగా DRT రావడంతో ఎన్టీఆర్ కోర్ట్ మెట్లెక్కారు. జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించింది. జూన్ 6 న విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు తెలిపింది.