HomeTelugu Newsఫ్యాన్స్‌కు ఎన్టీఆర్‌ భావోద్వేగ ట్వీట్

ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్‌ భావోద్వేగ ట్వీట్

9 17టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తన ఫ్యాన్స్‌కు తారక్ ధన్యవాదాలు తెలిపాడు. ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఓ భావోద్వేగ ట్వీట్ చేశాడు.

‘మీరు నా మీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా నిలుస్తున్న మీరే నా బలం. మీ రుణాన్ని ఏమిచ్చి తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని కాగలను? చివరిదాకా మీకు తోడుగా ఉండటం తప్ప’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కో స్టార్స్‌, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని తారక్ అన్నాడు. అందరి ట్వీట్లు చదవడం గొప్పగా అనిపించిందని… మీరందరూ ఈరోజును మరింత స్పెషల్ గా మార్చారని చెప్పాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu