టాలీవుడ్లో నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తెలుగు తెరపై తనదైన నటనతో భారీ పాపులారిటీ కూడగట్టుకున్న ఆయన పాపులర్ రియాల్టీ షో ‘బిగ్ బాస్-1’తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. తాజాగా బుల్లితెరపై ప్రసారం కానున్న మరో పాపులర్ షోకి ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఆయనకు భారీ ఆఫర్ ఇచ్చారట.
బుల్లితెరపై బిగ్ బాస్ ఎంతలా అయితే పాపులర్ అయిందో అదే రేంజ్లో దూసుకుపోతున్న మరో షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’. తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో ఈ షో ప్రసారం అయింది కానీ.. హిందీలో వచ్చిన టీఆర్ఫీ తెలుగులో రాబట్టలేక పోయింది. ఇప్పటికే స్టార్ హీరోలు నాగార్జున, చిరంజీవిలు ఈ షో హోస్ట్ చేసినా అనుకున్న ఫలితం రాలేదట. దీంతో ఈ సారి పక్కాగా ప్లాన్ చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని రంగంలోకి దించుతున్నారని సమాచారం. అంతేకాదు ఈ సారి ‘స్టార్ మా’ ఛానల్లో కాకుండా జెమినీ టీవీలో ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ప్రసారం కానుందట. ఈ మేరకు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టైటిల్‌తో పాటు షోలో కొన్ని మార్పులు చేర్పులు చేసిందట జెమినీ యాజమాన్యం. అదేవిధంగా ఈ షో హోస్ట్ చేసినందుకు గాను ఎన్టీఆర్‌ని ఒప్పించడంలో విశ్వ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారని వినికిడి. అంతేకాదు ఇప్పటిదాకా టెలివిజన్ చరిత్రలో లేని విధంగా ఎన్టీఆర్‌కి కళ్లు చెదిరే రెమ్మ్యూనరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అయిపోతున్నారు.