కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని పోటీపై ఆమె సోదరులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో మా తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. టీడీపీ మాకు ఎంతో పవిత్రమైనది. మా నాన్న హరికృష్ణ టీడీపీకు ఎనలేని సేవలందించారు. మా సోదరి సుహాసిని కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తున్న విషయం మీకు తెలిసిందే. సమాజంలో స్త్రీలు ఉన్నతమైన పాత్ర పోషించాలని నమ్మే కుటుంబం మాది. అదే స్ఫూర్తితో ప్రజాసేవకు సిద్ధపడుతోన్న మా సోదరికి విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నాం. జై ఎన్టీఆర్. జోహార్ హరికృష్ణ.’ అని కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ పేర్కొన్నారు.
Wishing my sister Suhasini garu all the very best, as she takes her first step into public service pic.twitter.com/Hl2TJ4rMsd
— Jr NTR (@tarak9999) November 17, 2018