Ram Charan – Jr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ మధ్య ఉండే హోరా హోరి.. పోటీ అందరికీ తెలిసిందే. ఈ రెండు ఫ్యామిలీ హీరోల మధ్య.. ప్రతి తరంలోనూ పోటీ ఉంటుంది. ఈ క్రమంలో రామ్ చరణ్ ఈమధ్య జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కన్నా ముందు ఈ ఇద్దరు హీరోలు.. కూడా రాజమౌళి సినిమాలలో నటించారు. రామ్ చరణ్ మగధీరలో నటించగా.. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో చేశారు.
కాగా ఈ మధ్య రాజమౌళి పైన నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ కోసం.. మన హీరోలు, టెక్నీషియన్లతో నెట్ ఫ్లిక్స్ స్పెషల్ చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి వారు ఎన్నో విషయాలను పంచుకున్నారు.
ఈ చిట్ చాట్ లో రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ మాటల్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. రామ్ చరణ్ తన మగధీర సినిమా నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు రాజమౌళి గురించి మాట్లాడుతూ..రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాను చిరంజీవి చూశారట. ఆ సినిమా చూసిన తరువాత చిరు మైండ్ బ్లోన్ అయిందట. ఆ సినిమా చాలా బాగుంది అని చిరంజీవి మెచ్చుకున్నారంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ సినిమా పైన చిరంజీవి నాటి రియాక్షన్‌ను.. నేడు ఇలా రామ్ చరణ్ బయటపెట్టడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.