టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత తమని మోసం చేశారని జీస్టర్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ ఫిలిం ప్రొడక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ హేమ ఆరోపించింది. తమవద్ద డబ్బులు తీసుకొని ఇప్పటివరకు చెల్లించలేదని తెలుపుతూ వారిపై తమిళనాడు రాష్ట్రం, తిరువళ్ళూరు జిల్లా ఎస్పి రాజశేఖర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్ తండ్రి వరద రాజన్ వలన రాజశేఖర్, జీవిత మాకు పరిచయమయ్యారు. రాజశేఖర్ తో సినిమా తీసే వారు లేని సమక్షంలో మేము పిఎస్-4 గరుడ వేగ సినిమా తీసాం. తన ఆస్తులను మా వద్ద తాకట్టు పెట్టి రూ. 26 కోట్లు తీసుకున్నారు. మా వద్ద ప్రాపర్టీ పెట్టి మమ్మల్ని మోసం చేసారు.
ఇక సినిమా పూర్తయ్యాక సినిమాకు డబ్బు పెట్టిన మామామల్ని వదిలేసి సంజయ్ రామ్ కు సినిమాను అమ్మేశారు. జీవిత, రాజశేఖర్ చాలా మంచి మనుషులుగా బయటి ప్రపంచంలో ఛలామణి అవుతున్నారు. వారి వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం.. అని చెప్పుకొచ్చింది. ఇక జీస్టర్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ ఫిలిం ప్రొడక్షన్ ఫౌండర్ కోటేశ్వరరాజు మాట్లాడుతూ.. అవకాశం కోసం జీవిత,రాజశేఖర్ మమ్మల్ని వాడుకున్నారు. వారు ఇప్పటివరకు మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. త్వరలో రాజశేఖర్ జైలుకు వెళ్తాడు. జీవిత చాలా డేంజరస్ మనస్తత్వం కలిగిన మనిషి అని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ కేసుపై రాజశేఖర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.